ఓవర్సీస్లో ప్రభాస్ దూకుడు

Published on Apr 30, 2021 3:00 am IST

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం ఆకాశాన్ని తాకింది. ఆ సినిమా హక్కులు ఇండియాలోనే కాదు తెలుగువారున్న ప్రతి చోటా భారీ ధరకు అమ్ముడయ్యాయి. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘సాహో’ కూడ రికార్డ్ స్థాయి రేట్లకు అమ్ముడు కాగా ‘రాధేశ్యామ్’ కూడ అదే స్థాయిలో అమ్ముడుపోతోంది. ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఉంది. పలువురు టాప్ డిస్ట్రిబ్యూటర్లు పెద్ద మొత్తం చెల్లించడానికి ముందుకొస్తున్నారు.

ఈ డిమాండ్ చూస్తుంటే హక్కులు తక్కువలో తక్కువ 3.5 మిలియన్లకు అమ్మడు కావొచ్చని అనిపిస్తోంది. ఒకవేళ ఈ ధర 4 మిలియన్ డాలర్లను తాకినా ఆశ్చర్యం లేదు. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. కృష్ణంరాజు, టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రభాస్ నుండి సినిమా వచ్చి చాలా కాలం కావడంతో అభిమానులు ఈ పాన్ ఇండియా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జస్టిన్ ప్రభాకరన్, మితున్, అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :