“రాధే శ్యామ్” గ్లింప్స్..వాలెంటైన్స్ డే పర్ఫెక్ట్ ట్రీట్.!

“రాధే శ్యామ్” గ్లింప్స్..వాలెంటైన్స్ డే పర్ఫెక్ట్ ట్రీట్.!

Published on Feb 14, 2021 9:35 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న అందమైన తరుణం ఇప్పుడు రానే వచ్చింది. ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం టీజర్ ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల కాబడింది. ప్యూర్ వింటేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి మేకర్స్ 52 సెకండ్లు నిడివి గల గ్లింప్స్ టీజర్ ను విడుదల చేశారు.

ఇక దీనిని చూసినట్టు అయితే సింగిల్ వర్డ్ లో బ్యూటిఫుల్ అని చెప్పాలి. మొదటి నుంచీ మేకర్స్ ఈ చిత్రం ఒక అందమైన పెయింటింగ్ లా ఉంటుంది అని చెప్తూ వస్తున్నారు. ఆ మాటలను నిజం చేస్తూనే అద్భుతమైన విజులవ్స్ తో ఈ టీజర్ కనిపించింది. అలాగే ఇటాలియన్ భాషలో ప్రభాస్ డైలాగ్స్ ఆ రైల్వే స్టేషన్ వర్క్ అన్నీ ఓ సరికొత్త ప్రపంచాన్ని అంటే ఇప్పుడున్న వారికి సరికొత్త అనుభూతిని తెస్తాయి.

మరి ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంపుగా అనిపిస్తుంది. ఫైనల్ గా తన లవ్ ను విక్రమ్ ఆదిత్య ప్రేరణకు చెప్పే డైలాగ్ సింప్లి సూపర్బ్..ఓవరాల్ గా మాత్రం ఈ గ్లింప్స్ ఈ వాలెంటైన్స్ డే కు ఒక పర్ఫెక్ట్ ట్రీట్ అని చెప్పాలి. అది ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్ కే కాదు ప్రేమను ఆస్వాదించే అందరికీ..అయితే ఇదే టీజర్ వీడియోలో ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 30న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించేసారు. సో రెబల్స్ గెట్ రెడీ..

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు