“రాధే శ్యామ్” హిందీ సాంగ్ కి రికార్డ్ రెస్పాన్స్.!

Published on Dec 4, 2021 5:00 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన భారీ చిత్రం “రాధే శ్యామ్”. భారీ అంచనాలు నెలకొల్పుకుని ఉన్న ఈ చిత్రం మన దగ్గరతో పాటు హిందీ మార్కెట్ లో కూడా భారీ హైప్ లో ఉంది. మరి దానికి నిదర్శనంగా ఈ చిత్రంలో నుంచి రిలీజ్ చేసిన హిందీ సింగిల్ కి వచ్చిన రెస్పాన్స్ కోసం అని చెప్పాలి. మొదటి రోజే రికార్డు వ్యూస్ లైక్స్ అందుకున్న ఈ సాంగ్ ఇప్పుడు 1 మిలియన్ లైక్స్ సాధించి ఇంకో రికార్డు అందుకుంది.

దీనితో ప్రభాస్ కెరీర్ లో 10వ 1 మిలియన్ లైక్డ్ వీడియోగా ఇది నిలిచింది. మొత్తానికి మాత్రం “ఆషీకీ ఆగయి” హిందీలో బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అయ్యిందని చెప్పాలి. ఇక ఈ సాంగ్ ని హిందీలో మిథూన్ కంపోజ్ చెయ్యగా అర్జిత్ సింగ్ ఆలపించాడు. ఇక యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా 7 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :