‘రాధే శ్యామ్’ హాస్పిటల్ సెట్‌ అప్ డేట్ !

Published on Aug 4, 2020 12:30 am IST


నేషనల్ స్టార్ ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ అనే ‘జిల్’ మూవీ డైరెక్టర్ డైరెక్షన్ లో ‘రాధే శ్యామ్’ అనే ఓ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో 6 కోట్ల రూపాయల ఓ భారీ హాస్పిటల్ సెట్‌ ను ప్రస్తుతం మేకర్స్ నిర్మిస్తున్నారు. మరో ఇరవై రోజుల్లో ఈ సెట్ పూర్తి చేయనున్నారు. ఆ తరువాత ఆ హాస్పిటల్ సెట్‌ లోనే ప్రభాస్ పై కొన్ని కీలక యాక్షన్ సీన్స్ ను షూట్ చేయనున్నారు.

ఇక జిల్ సినిమాని బాగానే తెరకెక్కించిన డైరెక్టర్ రాధాకృష్ణ‌, ఆ సినిమాతో హిట్ ను మాత్రం అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తో హిట్ కొడితాడేమో చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని నాలుగు భాషల్లో గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More