ఇండియాలోనే మరో భారీ రికార్డు సెట్ చేసిన ప్రభాస్ “రాధే శ్యామ్”

Published on Jul 13, 2021 2:45 pm IST

పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల అయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ మోషన్ పోస్టర్ యూ ట్యూబ్ లో మరొక రికార్డ్ సెట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకూ రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ యూ ట్యూబ్ లో 21 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే ఒక మోషన్ పోస్టర్ యూ ట్యూబ్ లో ఈ స్థాయిలో వ్యూస్ సాధించడం ఇండియా లో ఇదే తొలిసారి అని చెప్పాలి. మోస్ట్ వ్యూడ్ మోషన్ పోస్టర్ గా ఇండియా లో రికార్డ్ సృష్టించింది. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించగా, జిల్ ఫేమ్ రాధా కృష్ణ చిత్రానికి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :