రాధే శ్యామ్ నుండి ఫస్ట్ లిరికల్ వీడియో ప్రోమో విడుదల!

Published on Nov 15, 2021 4:30 pm IST

ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రాధే శ్యామ్. బాహుబలి సిరీస్, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడం తో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ పై చిత్ర యూనిట్ ఒక ప్రకటన చేయడం జరిగింది.

జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ప్రోమో ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది. ఫస్ట్ లిరికల్ వీడియో ను త్వరలో విడుదల చేస్తున్నట్లు ఆ ప్రోమో తో ప్రకటించడం జరిగింది. టీ సిరీస్ ఫిల్మ్స్ మరియు యూ వీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :