ఓవర్సీస్ లో “రాధే శ్యామ్” కి సాలిడ్ బుకింగ్స్.!

Published on Mar 4, 2022 9:59 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ అవైటెడ్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా సినిమా ఇప్పుడు సాలిడ్ అంచనాలు నెలకొల్పుకొని వచ్చే వారం రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే ఈ భారీ సినిమా రిలీజ్ కి టైం తక్కువ ఉండడంతో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.

మరి మొదటగా ఓవర్సీస్ లో ఈ సినిమా బుకింగ్స్ స్టార్ట్ కాగా అక్కడ సాలిడ్ నంబర్స్ రాధే శ్యామ్ నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇంకా వారం రోజులు గ్యాప్ ఉండగానే రాధే శ్యామ్ యూఎస్ఏ బాక్సాఫీస్ దగ్గర ఆల్రెడీ 2 లక్షల డాలర్స్ మార్క్ ని దాటేసిందట. అలాగే ఇంకా యూకే లో కూడా రాధే శ్యామ్ కి సాలిడ్ నంబర్స్ నమోదు అవుతున్నట్టు ట్రేడ్ వర్గాలు వారు చెబుతున్నారు. మొత్తానికి అయితే ఓవర్సీస్ లో మాత్రం రాధే శ్యామ్ పెద్ద మొత్తంలోనే ప్రీమియర్స్ తో అందుకునేలా ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :