రాధేశ్యామ్ “నగుమోము తారలే” సాంగ్ ప్రోమో రిలీజ్..!

Published on Nov 29, 2021 8:43 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్” సినిమా భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్ల జోరును మరింత పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ “నగుమోము తారలే” అంటూ సాగే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.

అయితే తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించగా సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఇందులో ప్రభాస్ మరియు పూజాల మధ్య లవ్ అండ్ రొమాన్స్‌ని చక్కగా చూపించారు. ఈ ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 1న విడుదల చేయన్నున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

సాంగ్ ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :