యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పీరియాడిక్ వండర్ ఫుల్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇంకా ప్రస్తుతానికి అయితే ఈ చిత్రం తాలుకా టీజర్ కోసమే ప్రతీ ఒక్కరు కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు.
మరి ఇదిలా ఉండగా మేకర్స్ ఆ టీజర్ త్వరలోనే వస్తుంది అని చెప్పారు. కానీ మరో పక్క మాత్రం ఇతర ప్రముఖ సినిమాలు అన్నిటి నుంచి కూడా టీజర్ అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. విడుదల కూడా జరుగుతున్నాయి. లేటెస్ట్ గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న “వకీల్ సాబ్” టీజర్ కు కూడా డేట్ అండ్ టైం ను మేకర్స్ లాక్ చేసేసారు. మరోపక్క కోలీవుడ్ నుంచి విక్రమ్ చేస్తున్న “కోబ్రా” కూడా టైం ఫిక్స్ చేసుకుంది.
వీటితో పాటు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన “లవ్ స్టోరీ” టీజర్ కూడా ఫిక్స్ అయ్యింది. మరి ఇప్పుడున్న రేస్ లో రాధే శ్యామ్ టీజర్ ఒక్కటి మాత్రమే బాకీ ఉందని చెప్పాలి. అభిమానులు కూడా ఈ స్వింగ్ లో ఆ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మేకర్స్ నుంచి దీనిపై ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా జస్టిన్ ప్రభాకరన్ బ్యూటిఫుల్ ట్యూన్స్ ఈ చిత్రానికి అందిస్తున్నాడు.


