“రాధే శ్యామ్” కొద్దిగా లేట్ అవ్వొచ్చా లేక “కేజీయఫ్” లానేనా?

Published on Jun 1, 2021 11:12 pm IST

ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పడుతుంది. అలాగే మన దేశంలో కూడా ఊహించని రీతిలో వ్యాప్తి చెందిన కరోనా వల్ల మళ్ళీ థియేటర్స్ మూత పడ్డాయి. దానితో అనుకున్న సమయానికి రావాల్సిన పలు భారీ చిత్రాలు ఆగిపోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు రానున్న జూలై నెలలో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమాలే ఉన్నాయి.

వాటిలో నిర్మొహమాటంగా బిగ్గెస్ట్ యాక్షన్ పీరియాడిక్ డ్రామా “కేజీయఫ్ చాప్టర్ 2” ఫిక్స్ అయ్యే ఉందని మేకర్స్ చెప్తూ వస్తున్నారు. మరి దీనితో పాటుగా ఇదే జూలై నెలలో ఆ కేజీయఫ్ విడుదల అయ్యే రెండు వారాలకే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం “రాధే శ్యామ్” కూడా ఫిక్స్ అయ్యింది. అయితే వీరు కూడా అధికారికంగా సినిమా వాయిదా వేస్తున్నామని ఇంకా చెప్పిన దాఖలాలు లేవు.

కాకపోతే ఈ చిత్రంలో ఇంకా పది రోజుల మేర రీ షూట్స్ ఉన్నాయి. అవన్నీ ఫినిష్ చేసి వాటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాంగ్స్ లాంచ్ ఇంకా చాలానే తతంగం ఉంది. మరి వీటన్నిటి బట్టి చూస్తే రాధే శ్యామ్ రిలీజ్ అవుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :