శ్రీలంక పేలుళ్ల నుండి తృటిలో తప్పించుకున్న సీనియర్ నటి !

Published on Apr 21, 2019 12:07 pm IST

శ్రీలంక రాజధాని కొలంబోలో ఈరోజు ఉదయం 8: 30 గంటల ప్రాంతం లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు50 మంది మృతిచెందగా మరో 200 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తుంది.

ఈస్టర్‌ సండే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులనే లక్ష్యంగా చేసుకొని టెర్రరిస్టులు ఈ దాడులకు పాల్పడ్డారు . కొలంబో లోని మొత్తం ఆరు ప్రాంతాల్లో బ్లాస్టింగ్ జరిగినట్లు సమాచారం. అందులో కొలంబోలోని సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్ కూడా ఒకటి. ఇక ఈ ఘటన నుండి త్రుటి లో బయటపడ్డారు సీనియర్ నటి రాధికా శరత్ కుమార్.

సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్ లో స్టే చేసిన రాధికా ఈ ఘటన జరిగే కొద్దీ నిమిషాల ముందు ఆమె ఈ హెటల్ ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. దాంతో ప్రాణాపాయం నుండి తప్పించుకోగలిగారు. ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న రాధికా షాకింగ్ గా ఉందని నేను హోటల్ ను ఖాళీ చేసిన కొద్దీ సేపటికే బ్లాస్టింగ్ జరిగింది . దేవుడు అందరి తో ఉండాలని అని ఆమె ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం :