సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రదారులుగా నటించిన చిత్రం “రాగల 24 గంటల్లో”. శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్ పై ఢమరుకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో నవ నిర్మాత శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. నవంబర్ 15న ఈ సినిమా విడుదల కానుంది. అలాగే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫై తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం డి ఐ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను నవంబర్ మొదటి వారానికి కల్లా పూర్తి చేయనున్నారు. ఇక ఈ చిత్రం ప్రమోషనల్ సాంగ్ ని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.


