సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రదారులుగా నటించిన చిత్రం “రాగల 24 గంటల్లో”. కాగా తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ లో భార్య భర్తల మధ్య రొమాన్స్ ను, అలాగే భర్త చనిపోవడం.. అది చంపింది తానే ని భార్య అంగీకరించడం.. ఆ హత్య చుట్టూ జరిగే విచారణ ఇలా మొత్తానికి ట్రైలర్ బాగానే ఇంట్రస్ట్ గా సాగుతుంది.
శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్ పై ఢమరుకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో నవ నిర్మాత శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా నవంబర్ 15న ఈ సినిమా విడుదల కానుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను నవంబర్ మొదటి వారానికి కల్లా పూర్తి చేయనున్నారు.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


