జడల్ కి ధీటైన విలన్.. ‘ది ప్యారడైజ్’ నుంచి అదిరిపోయిన రాఘవ్ జుయెల్ ఎంట్రీ

జడల్ కి ధీటైన విలన్.. ‘ది ప్యారడైజ్’ నుంచి అదిరిపోయిన రాఘవ్ జుయెల్ ఎంట్రీ

Published on Jun 19, 2026 8:00 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమానే “ది ప్యారడైజ్”. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఆల్రెడీ అనేక కీలక పాత్రలు పరిచయం అయ్యాయి. అయితే లేటెస్ట్ గా విలన్ రాఘవ్ జుయెల్ ని ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ వీడియోతో ప్రెజెంట్ చేయడం కేజ్రీగా మారింది. తన పూర్తి మేకోవర్ ని మార్చేసి తెలుగు సహా హిందీ ఆడియెన్స్ కూడా ఆశ్చర్య పడేలా దర్శకుడు అతన్ని ప్రెజెంట్ చేసాడు.

తన లుక్ కానీ తనకి అనిరుద్ ఇచ్చిన ఈవిల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా తనని మరింత ఎలివేట్ చేసింది. ఇక లాస్ట్ లో జడల్ తో ఫేస్ ఆఫ్ సీక్వెన్స్ అన్నట్టుగా వదిలిన ఎండింగ్ షాట్ ఇద్దరి మధ్య యుద్ధం ఏ లెవెల్లో ఉంటుందో చెప్పేలా ఉంది. సో మొత్తానికి మాత్రం మేకర్స్ మూవీ లవర్స్ కి థియేటర్స్ లో ఒక ప్యాకెడ్ ఎమోషనల్ యాక్షన్ ట్రీట్ ని అందిస్తున్నారు అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాని ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహిస్తుండగా ఈ ఆగస్ట్ 21 డేట్ నే ఫైనల్ చేసి రూమర్స్ కి చెక్ పెట్టారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు