వెట్రిమారన్, లారెన్స్ క్రేజీ కాంబినేషన్.. మోషన్ పోస్టర్ అదిరింది

Published on Jun 25, 2021 3:02 am IST

భిన్నమైన చిత్రాలతో మెప్పిస్తూ వచ్చిన రాఘవ లారెన్స్ మరొక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నారు. కొద్దిసేపటి ఆయన కొత్త చిత్రం ‘అధిగారం’ మోషన్ పోస్టర్ విడుదలైంది. ఇందులో లారెన్స్ పూర్తి డిఫరెంట్ లుక్ ట్రై చేయడం జరిగింది. లుక్ భిన్నంగానే కాదు గంభీరంగానూ ఉంది. ఈ సినిమాలోని మరొక విశేషం ఏమిటంటే సెన్సేషనల్ డైరెక్టర్ వెట్రిమారన్ కథను అందించడం జరిగింది. వెట్రిమారన్ స్టోరీ ట్రీట్మెంట్ పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రతి కథలోనూ వయోలెన్స్, రివెంజ్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి.

‘ఆడుకాలం, విసారనై, వాడ చెన్నై, అసురన్’ చిత్రాలు చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. మోషన్ పోస్టర్ చూస్తే ఆ చిత్రాల తరహాలోనే ఉంటుందని అనిపిస్తుంది. కథ మాత్రమే కాదు కథనం, మాటలు కూడ వెట్రిమారన్ అందిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ ఏడాది చివర్లో మలేషియాలో షూటింగ్ మొదలుకానుంది. 50 రోజుల పాటు అక్కడే షూటింగ్ చేయనున్నారు. అనంతరం ఇండియాలోని పలు లోకేషన్లలో చిత్రీకరణ జరుపుతారట.

సంబంధిత సమాచారం :