దుర్గ గా వస్తున్న రాఘవ లారెన్స్…టైటిల్ అనౌన్స్ మెంట్!

Published on Aug 6, 2021 7:48 pm IST


రాఘవ లారెన్స్ కొరియోగ్రఫర్ నుండి నటుడుగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన రాఘవ లారెన్స్ మరొకసారి విలక్షణ నటనతో అలరించేందుకు సిద్దం అయ్యారు. తాజాగా తన తదుపరి చిత్రం ను ప్రకటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయారు. దుర్గ అనే టైటిల్ తో రాఘవ లారెన్స్ కొత్త సినిమా ను ప్రకటించారు. అంతేకాక అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో రాఘవ లారెన్స్ అఘోర రూపం లో ఉన్నారు. అయితే దెయ్యం, భూతం కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను ఇదివరకే ఆకట్టుకున్న లారెన్స్, ఈ చిత్రం లో ఎలాంటి సస్పెన్స్ చూపిస్తారో చూడాలి. అయితే ఈ చిత్రం పోస్టర్ ను విడుదల చేసిన లారెన్స్, ఆశీర్వాదం కావాలి అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :