ఎవరు చిత్ర యూనిట్ పై దర్శకేంద్రుడి ప్రశంసల జల్లు.

Published on Aug 17, 2019 2:03 am IST

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఎవరు మూవీలో నటించిన హీరో అడివి శేషు, అలాగే రెజీనా కాసాండ్రా లతోపాటు మొత్తం చిత్ర యూనిట్ ని ప్రశంసలతో ముంచెత్తారు. “చిత్రంలోని ప్రతి సన్నివేశం నేను ఎంజాయ్ చేశాను. ఊహించని మలుపులతో మతి చెదిరింది. దర్శకుడు వెంకట్ రాంజీ చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా చిత్రాన్ని చక్కగా తీశారు, అడివి శేషు, రెజీనా, అద్భుతంగా నటించారు. నిర్మాత పివిపి కి ,అలాగే మొత్తం చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు” అని ట్వీట్ చేశారు. అంత పెద్ద సీనియర్ దర్శకుడు మెచ్చుకున్నాడంటే పెద్ద విషయమే మరి.

నిన్న విడుదలైన ఎవరు చిత్రం మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వసూళ్ల పరంగా కూడా ఎవరు మూవీ దూసుకెళుతుందని సమాచారం.ధియేటర్ల సంఖ్య కూడా పెంచారట. పివిపి సినిమా బ్యానర్ పై పరం వి పొట్లూరి నిర్మించిన ఈ మూవీకి వెంకట్ రాంజీ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :