మహేశ్.. మామయ్య అని పిలువు !

మహేశ్.. మామయ్య అని పిలువు !

Published on May 18, 2019 10:10 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయి తొమ్మిది రోజులు అవుతున్న ‘మాహర్షి’ కలెక్షన్స్ మాత్రం చాలా ఏరియాల్లో ఇంకా స్టడీగానే ఉన్నాయి. ఇప్పటికే నైజాంలో మహర్షి బ్రేక్ ఈవెన్ అయింది. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డు ను కూడా బ్రేక్ చేసింది. అందుకే చిత్రబృందం మాహర్షి విజయోత్సవ వేడుకను ఈ రోజు విజయవాడలోని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు.

కాగా ఈ సందర్భంగా మాట్లాడిన సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు ‘మహేశ్ ‘రాజకుమారుడు’ షూట్‌ లో నన్ను మామయ్య, మామయ్య అనేవాడివి. ఇప్పుడు నువ్వు వేదికపైకి వస్తావు, నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు థాంక్స్ చెబుతావు. అప్పుడు నన్ను రాఘవేంద్రరావు గారు అనొద్దు.. రాజకుమారుడు’ షూట్‌ లో పిలిచినట్లు మామయ్య అని పిలువు’ అని అన్నారు. మహేశ్ కూడా ఆయన్ని సరదాగా ఆయన్ని మామయ్య అని పిలిచారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. అలాగే ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు