నాగ శౌర్య ని పరామర్శించిన దర్శకుడు రాఘవేంద్ర రావు.

Published on Jun 19, 2019 3:39 pm IST

యంగ్ హీరో నాగ శౌర్య ఇటీవల ఓ మూవీ చిత్రీకరణలో భాగంగా ఎత్తైన భవనంపై నుండి దూకడం వలన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన కాలికి బలమైన గాయం కావడం వలన వైద్యులు దాదాపు నెల రోజుల విశ్రాంతి అవసరమని చూచించడంతో ఆయన కొద్దిరోజులుగా ఇంటికే పరిమితమయ్యారు.

ఈ విష‌యం తెలుసుకున్న ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు గారు ఈరోజు నాగ‌శౌర్య నివాసానికి విచ్చేసి ప‌రామ‌ర్శించారు. కె.రాఘ‌వేంద్ర‌రావు గారి తో మరో ద‌ర్శ‌కుడు బి.వి.య‌స్ ర‌వి కూడా నాగ‌శౌర్య‌ని ప‌రామ‌ర్శించారు. దర్శకుడు రాఘవేంద్రరావు నాగ శౌర్య ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారట. అలాగే త్వరగా నాగ శౌర్య కోలుకోవాలని కాంక్షించారంట. రాఘవేంద్ర రావు ముగ్గురు హీరోయిన్స్ , ముగ్గరు దర్శకులతో నిర్మించనున్న ప్రయోగాత్మక మూవీలో హీరోగా నాగ శౌర్య ను తీసుకున్నారని సమాచారం.

సంబంధిత సమాచారం :

X
More