జూలై మొదటి వారం నుండి మొదలుకానున్న భారీ మల్టీ స్టారర్ !
Published on Jun 9, 2018 5:23 pm IST

ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో రూపొందుతున్న మల్టీ స్టారర్ సినిమాల్లో వెంకటేష్, నాగ చైతన్యల సినిమా కూడా ఒకటి. వరుసకు మామ, అల్లుళ్ళు అయిన వెంకీ, చైతులు కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఎక్కువగానే ఉంది. తాజా సంచారం ద్వారా ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూట్ జూలై మొదటి వారంలో మొదలవుతుందని తెలుస్తోంది.

అంతేగాక ఈ చిత్రానికి ‘వెంకీ మామ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని అంటున్నారు. అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తేనే ఈ విషయాలన్నిటిపై ఒక క్లారిటీ వస్తుంది. కోన వెంకట్, సురేష్ బాబు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాబి డైరెక్ట్ చేయనుండగా ఇందులో వెంకటేష్ జతగా హ్యూమా ఖురేషి, చైతూకి జోడీగా రకుల్ ప్రీత్ నటించనున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook