‘రహదారి’ ట్రైలర్ రిలీజ్..!

‘రహదారి’ ట్రైలర్ రిలీజ్..!

Published on Jul 10, 2015 12:02 PM IST

rahadari
శ్రేయాస్ మీడియా పతాకంపై జి. శ్రీనివాస్ రావు నిర్మించిన రోడ్ థ్రిల్లర్.. ‘రహదారి’. రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్, సేదు, పూజాలు ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలోనే విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు సంబంధించిన థియేటికల్ ట్రైలర్‌ను నిన్న హైద్రాబాద్‌లో లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా సినిమా యూనిట్ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేసింది.

ఇక త్వరలోనే సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నామని దర్శక, నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాకు రాహుల్ రాజ్ సంగీత దర్శకత్వం వహించగా, కిషోర్ మణి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఇక ఈ సినిమాకు ఎడిటర్ : వీ.టీ. విజయన్, పాటలు : వెన్నెలకంటి, ఆర్ట్ : మోహన మహేంద్రన్, డ్యాన్స్ : గాయత్రి రఘురామ్.

తాజా వార్తలు