ఇంటర్వ్యూ : రుహాని శర్మ – ఈ సినిమా చూసాక అందరూ నా పాత్రను ఇష్టపడతారు !
Published on Jul 24, 2018 2:47 pm IST

యువ హీరో సుశాంత్, రుహాని శర్మ జంటగా హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘చి ల సౌ’. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్ర టీజర్, ప్రోమోలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. త్వరలో విడుదల కావడానికి సన్నద్ధం అవుతుంది. కాగా ఈ సందర్భంగా, ఈ చిత్ర హీరోయిన్ రుహాని శర్మ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

మీ నేపథ్యం గురించి ?
నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివాను, ఆ తర్వాత మోడలింగ్ చేశాను. అయితే ఇంస్టాగ్రామ్ లో ఈ చిత్ర నిర్మాతలు నా ఫోటోలను చూసి ‘చి ల సౌ’లోని హీరోయిన్ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. నేను అప్పటివరకు చేసిన యాడ్స్ చూపించి, వారికి ఆడిషన్ కూడా ఇచ్చాక, ఈ పాత్ర కోసం నన్ను ఎంపిక చేశారు

ఈ చిత్రంలో మీ పాత్ర ఏమిటి ?
విలువలతో చాలా సంప్రదాయబద్దంగా, స్వతంత్ర గల అమ్మాయిగా ఈ చిత్రంలో నేను కనిపిస్తాను. నా పాత్ర చాలా ఆలోచనాత్మకంగా కూడా ఉంటుంది. నాకు యాక్టింగ్ కి చాలా స్కోప్ ఉన్న రోల్ ఇది. ఈ సినిమా చూసాక అందరూ నా పాత్రను ఇష్టపడతారు అనుకుంటున్నాను.

మీకు తెలుగు రాదు కదా, మరి తెలుగులో పని చేయడం కష్టమనిపించలేదా ?
నిజంగానే మొదట్లో చాలా కష్టంగా అనిపించింది. కానీ నేను తెలుగు డిక్షన్ కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశాను. పైగా తెలుగు లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవటానికి హీరో నాని నటించిన సినిమాలన్నీ చూశాను. ఇప్పుడు నా తెలుగు చాలా బెటర్ అయిందనుకుంటున్నాను.

రాహుల్ రవీంద్రన్ తో కలిసి పని చేయడం ఎలా అనిపించింది ?
ఆయన మా నుండి సరైన నటన రాబట్టుకోవడానికి చాలా హార్డ్ వర్క్ చేశారు. చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ దగ్గరనుంచి ప్రతి ఎక్స్ ప్రెషన్ దాకా ఎంతో కేర్ తీసుకున్నారు. పైగా ఆయన నటుడి కూడా కావడం వల్ల, ఆయన ఇచ్చిన సూచనలు మాకు ఉపయోదపడ్డాయి.

ఈ చిత్రంలో మీరు సుశాంత్ కి జోడిగా నటించారు. మీకు ఆయనలో బాగా నచ్చిన అంశం ఏమిటి ?
సుశాంత్ నటించడం చాలా చాలా సౌకర్యంగా ఉండేది. తాను కూడా అలాగే ఉండేవాడు. మేము జనరల్ గా సినిమాల గురించి చాలా డిస్కర్షన్స్ చేసుకున్నేవాళ్ళం. ఇక ఈ చిత్రం షూట్ సమయంలో అయితే తన సపోర్ట్ మరవలేనిది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook