ఎఆర్ రెహమాన్ ని షాక్ కి గురిచేసిన హాలీవుడ్ మూవీ

ar-rahaman
ఇండియన్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన సినిమా ‘స్లండాగ్ మిలీనియర్’. ఈ సినిమా తర్వాత 127 అవర్స్ సినిమాకి సంగీతం అందించాడు. ఆ తర్వాత హాలీవుడ్ లో గ్యాప్ తీసుకున్న ఎఆర్ రెహమాన్ త్వరలో రిలీజ్ కానున్న ‘మిలియన్ డాలర్’ సినిమాకి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ ఏజెంట్ ఇద్దరు ఏషియన్ క్రికెట్ ప్లేయర్స్ ని ఎలా బేస్ బాల్ కెరీర్ లో విజయం సాధించేలా చేసాడనేదే కథాంశం..

1999లో రెహమాన్ తమిళ్ సినిమాకి కంపోజ్ చేయగా చిత్ర పాడిన ‘ఎన్ శ్వాస కాట్రే’ పాటని ఈ సినిమాలో వాడడంతో రెహమాన్ షాక్ అయ్యాడు. ‘అసలు ఈ సినిమాలోకి ఆ పాటని ఎలా తీసుకున్నారన్నది నాకు అస్సలు తెలియదు. ఈ చిత్ర మేకర్స్ ఇండియాలో నా మ్యూజిక్ పై రీసర్చ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ పాట నచ్చి అందులో పెట్టుకున్నారు. నేను సినిమా చూస్తున్నప్పుడు వావ్ ఇదెక్కడి నుంచి అనుకున్నాను. కానీ చాలా బాగా అనిపించిందని’ అన్నాడు.

Exit mobile version