సస్పెన్సు ఎలిమెంట్స్ తో థ్రిల్లింగా రాహు ట్రైలర్

Published on Nov 14, 2019 7:23 pm IST

అభిరామ్ వర్మ, కృతి గార్గ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ రాహు. శ్రీ శక్తి స్వరూప్ మూవీ క్రియేషన్స్ పతాకంపై సుబ్బు వేదుల దర్శకత్వంలో తెరకెక్కింది. కాగా నేడు ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. రాహు అనే ఓ సైకో కిల్లర్ చెరలో పడిన హీరోయిన్ మరియు అతని చెల్లి కథే రాహు మూవీ అని తెలుస్తుంది. సస్పెన్సు కలిగించే థ్రిల్లింగ్ అంశాలతో పాటు హీరోహీరోయిన్ల మధ్య మంచి లవ్ ట్రాక్ ఉంటుందని సమాచారం.

ఇక కిడ్నాపర్లు గా జబర్ధస్త్ ఫేమ్ చలాకి చంటి, గిరిధర్ కామెడీ ట్రైలర్ లో బాగా కుదిరింది. శ్రీ శక్తి స్వామి, రాజా దేవరకొండ, ఏవిఆర్ బాబ్జి, సుబ్బు వేదుల నిర్మిస్తుండగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించాల్సి వుంది.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More