‘ఆర్ఆర్ఆర్’లో రాహుల్ క్యారెక్టర్ అదేనా ?

‘ఆర్ఆర్ఆర్’లో రాహుల్ క్యారెక్టర్ అదేనా ?

Published on Aug 2, 2020 1:49 AM IST


దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. పైగా ఎన్టీఆర్ కి ఫ్రెండ్ రోల్ లో నటించబోతున్నాడు. కాగా రాహుల్ ది ట్రైబ్ క్యారెక్టర్ అట. పైగా ఎక్కువ సీన్స్ లో కనిపిస్తాడట. రాహుల్ పాత్ర చివర్లో కాస్త ఎమోషనల్ గా ముగుస్తోందట. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ధృడంగా ఉండే కొమరం భీం రోల్ కోసం ఎన్టీఆర్ ఇప్పటికే లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు.

ఇక ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత గ్రేట్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, పైగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మొదటిసారి నటిస్తుండటంతో ఈ మల్టీస్టారర్ పై ఆరంభం నుండి భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు