ఇంటర్వ్యూ : రాహుల్ విజయ్ – సూర్యకాంతం లో క్లైమాక్స్ హైలైట్ అవుతుంది !

Published on Mar 27, 2019 4:03 pm IST

ఈమాయ పేరేమిటో తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు స్టంట్ మాస్టర్ విజయ్ తనయుడు యువ హీరో రాహుల్ విజయ్. ఈసినిమా తరువాత ఆయన నటించిన రెండవ చిత్రం ‘సూర్యకాంతం’ ఈనెల 29న విడుదలకానున్న సందర్భంగా రాహుల్ విజయ్ మీడియాతో మాట్లాడాడు. ఇప్పుడు ఆ విశేషాలు మీ కోసం…

ఈసినిమాలో అవకాశం ఎలా వచ్చింది ?

సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యి నిహారిక ను సూర్యకాంతం పాత్ర కు తీసుకున్నారు. తరువాత హీరో కోసం వెతికారు కానీ ఎందుకో ఎవరు సెట్ కాలేదు. ఓ సారి వరుణ్ అన్న నన్ను చూసి డైరెక్టర్ ప్రణీత్ కు ఫోన్ చేశాడు. ఆ తరువాత డైరెక్టర్ నన్ను కలిసి ఆడిషన్ చేశాడు. ఆలా ఛాన్స్ వచ్చింది.

ఈసినిమా కథ గురించి ?

స్టోరీ మెయిన్ గా అభి , కాంతం , పూజా లమధ్యనే జరుగుతుంది. చాలా ఎంటెర్టైనింగ్ గా ఉంటుంది. ఈసినిమా ఈ జెనరేషన్ వారికీ బాగా కనెక్ట్ అవుతుందనుకుంటున్నాను.

ఈసినిమా చేస్తానంటే మీ నాన్నా గారు ఏమ్మన్నారు ?

మా నాన్న గారికి ఈసినిమా స్టోరీ చెప్పాను. నీకు నచ్చితే చెయ్యి నీ కెరీర్ నీ ఇష్టం అన్నారు. ఆయన ఎప్పుడు ఏమి చెప్పరు. స్తంట్స్ కూడా బయట నేర్చుకున్నాను. ఆయనకు కూడా నేను హీరో అవ్వడమే ఇష్టం.

మీ పాత్ర గురించి ?

సినిమాలో అభి అనే పాత్రలో నటించాను. కొంచెం ఇన్నోసెంట్ గా ఉంటుంది. ఇక కాంతం పాత్ర కంత్రి మేళం లా ఉంటుంది. ఈ అమ్మాయికి ఎంత దూరంగా ఉంటే అంత మంచింది అనే పాత్ర. ఇక పూజా పాత్రా ప్రతి ఒక్కరు ఇలాంటి అమ్మాయే కావాలకునే పాత్ర. ఈ మూడు పాత్రల తోనే సినిమా అంతా నడుస్తుంది.

మీ తదుపరి చిత్రం గురించి ?

నెక్స్ట్ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాను. కన్నడ లో సూపర్ హిట్ అయినా సినిమాను తెలుగు ,తమిళంలో రీమేక్ చేస్తున్నాం. ఏప్రిల్ మూడవ వారంలో ఈ చిత్రం స్టార్ట్ కానుంది.

సంబంధిత సమాచారం :