హాట్ బ్యూటీ యాక్షన్ అవతార్ అదిరిందిగా

Published on Aug 8, 2019 8:26 am IST

హీరోయిన్ రాయ్ లక్ష్మీ తరచుగా సోషల్ మీడియాలో హాట్ హాట్ డ్రెస్సులలో ఉన్న సెక్సీ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తూ ఉంటారు. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ రోల్స్ చేసిన రాయ్ లక్ష్మీ గత కొద్దికాలంగా కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేస్తుంది. వేర్ ఈజ్ వెంకట లక్ష్మీ, నాగ కన్య వంటి చిత్రాలలు ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కినవే. అలాగే ఆమె తాజాగా “ఝాన్సీ” అనే చిత్రంలో ఐపీఎస్ అధికారి గా కనిపించనున్నారు.

కొద్దిసేపటి క్రితం రాయ్ లక్ష్మీ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. మునుపటి బిన్నంగా రాయ్ లక్ష్మీ ఈ చిత్రంలో సీరియస్ మాస్ లుక్ అదిరించని చెప్పాల్సిందే. ఎప్పుడూ గ్లామర్ రోల్స్ హీటెక్కించే ఈమె ఈ చిత్రంలో మాత్రం యాక్షన్ తో అలరించనుంది తెలుస్తుంది. ఈ మూవీలో ఎవరినీ లెక్క చేయని పవర్ఫుల్ ఆఫీసర్ గా రాయ్ లక్ష్మీ పాత్ర ఉంటుందని సమాచారం. కాగా ఈ మూవీ ట్రైలర్ ఈనెల 11న విడుదల చేయనున్నారట. గురు ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నీ భవాని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజేష్ కుమార్ నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :