కలెక్షన్ల మోత మోగిస్తున్న ‘రైడ్ 2’.. ఏకంగా ఆ క్లబ్‌లోకి ఎంట్రీ!

కలెక్షన్ల మోత మోగిస్తున్న ‘రైడ్ 2’.. ఏకంగా ఆ క్లబ్‌లోకి ఎంట్రీ!

Published on May 19, 2025 8:57 PM IST

బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచిన ‘రైడ్’కు సీక్వెల్‌గా ఇటీవల ‘రైడ్ 2’ మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అజయ్ దేవ్గన్, రితేశ్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను రాజ్ కుమార్ గుప్తా డైరెక్ట్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తూ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది.

అయితే, ఈ సినిమా రిలీజ్ తర్వాత చాలా స్లోగా పికప్ అయింది. ఇప్పుడు ఈ సినిమా స్టడీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటుతోంది. మూడో వారం ముగిసిన తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.153.67 కోట్ల గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేసింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

బాక్సాఫీస్ దగ్గర పలు సినిమాలు పోటీనిస్తున్నా, ‘రైడ్ 2’ మాత్రం నిదానంగా వసూళ్లను రాబడుతూ దూసుకెళ్లడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు