షూటింగ్స్ కి అంతరాయం కలిగించిన వాన

Published on Mar 5, 2014 2:13 pm IST

rain
గత రెండు రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న అకాల వర్షాల వల్ల హైదరాబాద్ సిటీ ఒక్కసారిగా డల్ అయ్యింది. సిటీలో ఉన్న వారికి పలు ఇబ్బందులు ఎదురైతే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వారికి మాత్రం పెద్ద సమస్యే వచ్చింది.

ఇలా అనుకోకుండా వచ్చిన ఈ వర్షాల వల్ల హైదరాబాద్ అవుట్ డోర్ లో జరుగుతున్న చాలా సినిమాల షూటింగ్ ఆగిపోయింది. బాహుబలి, రభస లాంటి సినిమాల ప్రొడక్షన్ టీమ్స్ వర్షం వల్ల తమ షూటింగ్ ప్లాన్స్ మార్చుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితులను చూసుకుంటే ఈ వాతావరణం మరొక రోజు కూడా ఇలానే ఉండే అవకాశం ఉంది. సినిమా యూనిట్ సభ్యులంతా ఈ వర్షాల వల్ల కాస్త అప్సెట్ లో ఉన్నారు. ఇలా కాల వర్షాలు పడితే అవుట్ డోర్ లో షూట్ చేసే ప్రతి మూవీ టీం ఇబ్బంది పడాల్సి వస్తుంది.

సంబంధిత సమాచారం :