సాహో లో ఆయన లుక్ ఆసక్తికరం…!

Published on Aug 8, 2019 7:04 am IST

సాహో బృందం గత మూడు రోజులుగా చిత్రం లోని ముగ్గురు ప్రధాన ప్రతినాయకులైన నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, ఛంకీ పాండే లుక్స్ ని విడుదల చేయడం జరిగింది. సాహో చిత్రానికి తగ్గట్టుగా ఆ ముగ్గురు విలన్స్ లుక్స్ భారీ తనంతో కూడిన రిచ్ అప్పీరెన్స్ తో ఆకట్టుకున్నాయి. అలాగే సాహో మూవీలో ఆ ముగ్గురి పాత్ర స్వభావం తెలియజేసేలా ఒక్కొక్క విలన్ లుక్ పోస్టర్ లో ఒక ఆసక్తికర లైన్ తో విడుదల చేయడం గమనార్హం.

ఐతే సాహో చిత్రంలో బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ కూడా ఓ కీలక పాత్రచేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆయనది కూడా నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాక్షికమైన విలన్ పాత్రే అని సమాచారం. ఇప్పటికే ప్రతినాయకుడి పాత్రలు చేస్తున్న నీల్ నితిన్, అరుణ్ విజయ్, ఛంకీ పాండే ల లుక్స్ అభిమానుల అంచనాలకు మించి గ్రాండ్ గా ఉన్న నేపథ్యంలో జాకీ ష్రాఫ్ లుక్ పై ఆసక్తి కలుగుతుంది. గంభీరమైన ముఖం, భారీ ఖాయం కలిగి వుండే జాకీ ష్రాఫ్ లుక్ మిగిలిన విలన్స్ కి మించి ఉంటుంది అనడంలో సందేహం లేదు. త్వరలోనే ఆయన లుక్ కూడా విడుదలయ్యే అవకాశం కలదు.

యూ వి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తుండగా, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, మురళి శర్మ, ఎవ్లీన్ శర్మ వంటి ముఖ్యతారలు నటిస్తున్నారు. ఈనెల 30న గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :