ఈసారి హైబ్రిడ్ పిల్లని ఎలా చూపించబోతున్నాడో?

Published on Jun 28, 2019 8:23 am IST

శేఖర్ కమ్ములకు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక శైలి కలిగిన దర్శకుడిగా మంచి పేరుంది. యూత్ కి కావలసిన అంశాలు జోడించి ఫీల్ గుడ్ మూవీస్ తీయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన సినిమాలో ఉండే మరో ప్రత్యేకత హీరోయిన్ పాత్ర. శేఖర్ కమ్ముల సినిమాలలో హీరోయిన్స్ ఆత్మాభిమానం,స్వతంత్ర భావాలున్న దృఢమైన స్వభావం కలిగిన అమ్మాయిలలా కనిపిస్తారు. ఆయన మొదటి సినిమా “ఆనంద్” నుండి ”ఫిదా” వరకు ఆయన సినిమాలలో హీరోయిన్ పాత్ర హీరోని కూడా డామినేట్ చేసేలా ఉంటుంది.
నిన్న నాగ చైతన్య హీరోగా సాయి పల్లవితో ఈ డైరెక్టర్ ఓ మూవీ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. మరి ఈ మూవీలో సాయి పల్లవి పాత్రను ఎలా రూపొందిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత చిత్రం “ఫిదా”లో పుట్టిపెరిగిన పల్లె కోసం,తండ్రి కోసం ప్రేమించిన వాడిని సైతం వదులుకోవడాని ఇష్టపడే స్ట్రాంగ్ అమ్మాయిగా సాయి పల్లవిని చూపించి ప్రేక్షకుల ప్రశంసలందుకున్నారు శేఖర్ కమ్ముల.

సంబంధిత సమాచారం :

More