‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 3 కూడ ఉందట !

Published on May 21, 2021 10:00 pm IST

అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో మొదటిసారి భారీ లెవల్లో విజయం సాధించిన వెబ్ సిరీస్ ఇదే. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు సీక్వెల్ గా ‘ది ఫ్యామిలీ మ్యాన్ -2’ రూపొందింది. జూన్ 4వ తేదీన అది రిలీజ్ కానుంది. దీని మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అమెజాన్ ప్రైమ్ సంస్థ కూడ ఈ వెబ్ సిరీస్ సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉంది.

అందుకే సీజన్ 3 చర్చలు మొదలయ్యాయి. రాజ్ అండ్ డీకే ఇప్పటికే సీజన్ 3 కోసం స్టోరీ లైన్ అనుకుని ఉన్నారట. అది ప్రైమ్ సంస్థ బృందానికి నచ్చిందట. దీంతో రాజ్ అండ్ డీకే దాన్ని డెవలప్ చేసే పనిలో ఉన్నారట. ఇందులో కూడ మనోజ్ భాజ్పాయ్ లీడ్ రోల్ చేయనున్నారు. ఈసారి స్టోరీ ఇంటర్నేషనల్ లెవల్లో ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే రాజ్ అండ్ డీకే ప్రస్తుతం షాహిద్ కపూర్ హీరోగా ఒక వెబ్ సిరీస్, షారుఖ్ ఖాన్ హీరోగా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారు. అవి పూర్తయ్యాక ‘ది ఫ్యామిలీ మ్యాన్ -3’ పట్టాలెక్కే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :