సెప్టెంబర్ 5న ‘రాజ్ మహల్’ విడుదల.

సెప్టెంబర్ 5న ‘రాజ్ మహల్’ విడుదల.

Published on Sep 3, 2014 10:00 AM IST

Raja-mahal
సుర్యనాథ్, రియ, సందీప్తి నటినటులుగా అప్పాజీ కొండా దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రాజ్ మహల్’. హారర్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సన్.ఐ ప్రొడక్షన్స్ పతాకంపై హీరో సుర్యనాథ్ ఈ సినిమాను నిర్మించారు. సినిమా ఆద్యంతం ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుందని తెలిపారు.

హారర్, సస్పెన్స్, రొమాంటిక్ ఎలెమెంట్స్ తో తెరకెక్కిన సినిమా ఇది. సినిమాటోగ్రఫీ, సంగీతం సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయి. సుర్యనాథ్ గారు ఇచ్చిన అవకాశాన్ని వృధా చేయలేదని అనుకుంటున్నాను. చిన్న సినిమాలలో మంచి సినిమా అవుతుంది. అని దర్శకుడు అప్పాజీ కొండా తెలిపారు. కాదంబరి కిరణ్, సూర్యతేజ తదితరులు నటించిన ఈ సినిమాకు సురేష్ యువన్ సంగీతం అందించారు.

తాజా వార్తలు