రాజ్ తరుణ్‌ ‘అనుభవించు రాజా’ ఫస్ట్ లుక్ వచ్చేసింది..!

Published on Aug 28, 2021 9:34 pm IST

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో చేస్తున్న కొత్త చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ అయ్యింది. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను ‘అనుభవించు రాజా’గా చిత్ర బృందం ఖరారు చేయగా, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అక్కినేని నాగార్జున చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

కళ్లజోడు పెట్టుకుని, కోడిపుంజును పందెం బరిలో దింపుతున్నట్టు కనిపిస్తున్న రాజ్ తరుణ్ మాస్ లుక్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌ సరసన కాషిశ్‌ ఖాన్ నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :