షూటింగ్ పూర్తి చేసిన యంగ్ హీరో

Published on Jan 19, 2020 12:00 am IST

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ హీరోగా గుండెజారి గల్లంతయ్యిందే ఫేమ్ కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. దర్శకుడు లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తయిందని చిత్ర యూనిట్ తెలియజేశారు. దీనితో చిత్ర యూనిట్ మీడియా ముఖంగా చిత్ర విశేషాలు పంచుకున్నారు.

దర్శక నిర్మాతలు చిత్రం బాగా వచ్చిందని, అందరూ కష్టపడి పనిచేశారని విజయం పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న ‘ఒరేయ్‌ బుజ్జిగా’ సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 3 న విడుదల చేయనున్నారు. మాళవిక నాయర్, రాజ్ తరుణ్ కి జంటగా నటిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More