‘సినిమా చూపిస్త మావ’పై కాన్ఫిడెంట్‌గా రాజ్ తరుణ్

‘సినిమా చూపిస్త మావ’పై కాన్ఫిడెంట్‌గా రాజ్ తరుణ్

Published on Aug 13, 2015 9:34 PM IST

raj-tarun
‘ఉయ్యాల జంపాల’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన యువహీరో రాజ్ తరుణ్, తన రెండో సినిమా కోసం ఎన్నో కథలు విని చివరకు ‘సినిమా చూపిస్త మావ’ అంటూ ఇప్పటికి రెండో సినిమాను సిద్ధం చేశారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు (ఆగష్టు 14న) విడుదల కానుంది. ‘ఉయ్యాల జంపాల’ లాంటి అందమైన ప్రేమకథలో ఒదిగిపోయిన రాజ్ తరుణ్ – అవికా గోర్ జంట ‘సినిమా చూపిస్త మావ’తో మరోసారి మెప్పించేందుకు సిద్ధమయ్యారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బెక్కం వేణుగోపాల్ నిర్మించారు.

ఇక ట్రైలర్, పోస్టర్స్ ద్వారానే మంచి ఇంప్రెషన్ కలిగించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేసేందుకు ముందుకు రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయ్! అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకు సంబంధించి అన్ని ప్రాంతాల బిజినెస్ కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఇక తన మొదటి సినిమా తర్వాత చాలా కథలు విన్నానని, ఎన్నో కథల తర్వాత ఈ సినిమాను ఎంపిక చేసుకున్నానని, సినిమా కచ్చితంగా అందరినీ ఆకట్టుకొని మంచి విజయం సాధిస్తుందని హీరో రాజ్ తరుణ్ నమ్మకంగా చెబుతున్నారు. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ తరుణ్-రావు రమేష్‌ల పోర్షన్ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు