రాజ్ తరుణ్ లవర్ వచ్చేది అప్పుడే !
Published on Feb 28, 2018 9:39 am IST

‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్త మావ‌’, ‘కుమారి 21 ఎఫ్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజ్ తరుణ్ ఈ సంక్రాంతికి ‘రంగుల‌రాట్నం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తరువాత రాజుగాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తరువాత దిల్ రాజు నిర్మాణంలో తెరకేక్కబోతున్న లవర్ సినిమా నటిస్తున్నాడు రాజ్ తరున్ అనిష్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

రోమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న లవర్ సినిమాను ఈ ఏడాది జూన్ 14న విడుదల చెయ్యబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన రిద్ధి కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజ్ తరుణ్ గత రెండు సినిమాలు స్థాయిలో విజయం సాధించలేదు కావున ఈ సినిమాతో మళ్ళి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు ఈ హీరో.

 
Like us on Facebook