ఇద్దరి లోకం ఒకటే లో రాజ్ తరుణ్ రోల్ ఇదేనా ?

Published on Apr 23, 2019 11:00 pm IST

యంగ్ హీరో రాజ్ తరుణ్ సక్సెస్ చూసి చాలా రోజులు అవుతుంది. గత ఏడాది మూడు సినిమాలతో వచ్చినా ఒక్క చిత్రం తో కూడా హిట్ కొట్టలేకపోయాడు. దాంతో ‘లవర్’ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న రాజ్ తరుణ్ నిన్ననే ఒక సినిమా ను స్టార్ట్ చేశాడు. ‘ఇద్దరి లోకం’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జిఆర్ కృష్ణ దర్శకుడు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈచిత్రానికి మిక్కీ కె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ ఫొటో గ్రాఫర్ కనిపించనున్నాడని టాక్. ఈచిత్రంలో కథానాయిక పాత్రకు చాలా స్కోప్ ఉందట. ప్రస్తుతం ఈ చిత్రానికి హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారు చిత్ర బృందం.

సంబంధిత సమాచారం :