వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన “రాజ రాజ చోర”

Published on Oct 31, 2021 11:22 pm IST

శ్రీ విష్ణు హీరోగా, మేఘా ఆకాష్ హీరోయిన్ గా హసిత్ గోలి దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం రాజ రాజ చోర. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయి మంచి విజయం సాధించింది. ప్రేక్షకులను ఈ సినిమా విశేషంగా ఆకట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

జీ తెలుగు ఛానెల్ లో ఈ చిత్రం ప్రసారం కానుంది. త్వరలో ఈ చిత్రం జీ తెలుగు ఛానెల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందుకు సంబంధించిన విషయం తెలియడం తో అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ మరియు టిజీ విశ్వ ప్రసాద్ లు నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం :