‘రాజ రాజు వచ్చే’ లిరికల్ వీడియో భలే ఉందిగా!

Published on Jul 29, 2021 1:24 am IST

విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హీరో శ్రీ విష్ణు హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన్ మేఘా ఆకాశ్ నటిస్తుండగా, గంగవ్వ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టైటిల్ సాంగ్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘రాజ రాజు వచ్చే’ అనే లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. అయితే చిత్రీకరణ సన్నివేశాలతో రూపొందించిన ఈ వీడియో బాగా ఆకట్టుకుంది. అయితే ఈ పాటంకు హసిత్‌ గోలి రచించగా, వివేక్‌ సాగర్‌ స్వరాలు సమకూర్చగా, మోహన భోగరాజు ఆలపించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :