‘రాజా ది గ్రేట్’ రన్ టైమ్ కాస్త ఎక్కువే !
Published on Oct 16, 2017 8:02 pm IST

దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత రవి తేజ నుండి వస్తున్న చిత్రం ‘రాజా ది గ్రేట్’. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ అందుకుని మరోసారి తన పూర్వపు ఫామ్ ను అందుకోవాలని అనుకుంటున్నాడు రవితేజ. సినీ సర్కిల్స్ లో సినిమా గురించి వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆయన ఆశలు నెరవేరేలానే కనిపిస్తున్నాయి. సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి చాలా ఎంటర్టైనింగా తెరకెక్కించారని అంటున్నారు.

దానికి తోడు సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గానే ఉంది. సినిమా మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా హై వోల్టేజ్ తో ఉంటుందని అంటున్నారు. ఇక సినిమా రన్ టైమ్ చూస్తే 2 గంటల 29 నిమిషాలతో దగ్గర దగ్గర రెండున్నర గంటల పాటు ఉండనుంది. సాధారణంగా రెగ్యులర్ సినిమాల రన్ టైం తో పోలిస్తే ఇది కాస్త ఎక్కువనే చెప్పాలి. మరి రెండున్నర గంటల పాటు పేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెట్టేలా రవి తేజ ఎలాంటి వినోదం అందించారో చూడాలంటే ఈ నెల 18 వరకు ఆగాల్సిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook