త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “రాజా విక్రమార్క”

త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “రాజా విక్రమార్క”

Published on Feb 22, 2022 1:35 PM IST


కార్తికేయ హీరోగా శ్రీ సారిపల్లి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం రాజా విక్రమార్క. యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ను శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై 88 రమా రెడ్డి నిర్మించడం జరిగింది. తన్య రవి చంద్రన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయి, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది.

ఈ చిత్రం త్వరలో జెమిని టీవీ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు