టాలీవుడ్ గర్వించదగ్గ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం పారిస్ నగరంలో సందడి చేస్తున్నాడు. అక్కడి ప్రతిష్టాత్మక ‘సినీమాథెక్ ఫ్రాంకైస్’ వేదికగా ఆయన సంచలన చిత్రాలు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ ప్రత్యేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా రాజమౌళి, లెజెండరీ అంతర్జాతీయ దర్శకుడు కోస్టా-గవ్రాస్ నుండి ప్రత్యేక ప్రశంసలు అందుకోవడం విశేషం.
ఈ స్క్రీనింగ్స్‌కు హాజరవుతున్న అంతర్జాతీయ సినీ ప్రేక్షకులతో రాజమౌళి నిరంతరం ముచ్చటిస్తున్నాడు. ఒక ప్రత్యేక ప్రదర్శన ముగిసిన అనంతరం ఆయన అక్కడి ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజమౌళి సినిమాలకు అంతర్జాతీయ వేదికలపై లభిస్తున్న ఈ ఆదరణ చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, ఈ పారిస్ పర్యటన రాజమౌళి నెక్స్ట్ ప్రెస్టీజియస్ చిత్రం ‘వారణాసి’పై అంచనాలను మరింత పెంచేలా కనిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను, పారిస్‌లో ప్రదర్శిస్తున్న బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాల కంటే ముందే థియేటర్లలో స్క్రీనింగ్ చేస్తుండటం విశేషం. ఇది చూసిన విదేశీ ప్రేక్షకులు మరియు అభిమానులు థ్రిల్ అవుతున్నారు.


