“RRR” ని కూడా సిద్ధం చేస్తున్న జక్కన్న.!

Published on Jun 15, 2021 12:00 pm IST

ప్రస్తుతం మన తెలుగు సినిమా నుంచి వస్తున్న పలు భారీ బడ్జెట్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఆల్ మోస్ట్ ముగింపు దశలో ఉంది.

ఇంకా కొన్ని క్లైమాక్స్ షాట్స్ మరియు ఒకటి లేదా రెండు పాటలు బ్యాలన్స్ ఉన్నట్టు టాక్. మరి కరోనా వేవ్ మూలాన మళ్ళీ షూటింగ్స్ నిలిచిపోయిన ఎన్నో చిత్రాల్లో “RRR” కూడా ఒకటి. అయితే ఇప్పుడు ఈ నెల నుంచి మళ్ళీ షూటింగ్ పునః ప్రారంభం కానుండగా రాజమౌళి ఈ చిత్రానికి కూడా సమయం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

అయితే రాజమౌళి జూలై నెల నుంచి షూటింగ్ ను ప్రారంభం చెయ్యాలి అనుకుంటున్నారట. ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ గ్రాండియర్ కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి రాజమౌళి అనుకున్న సమయానికే ప్లాన్ చేస్తారో లేదో కాలమే డిసైడ్ చెయ్యాలి.

సంబంధిత సమాచారం :