రాజమౌళే కాదు, వినాయక్ కల కూడా అదేనట

Published on Oct 10, 2019 11:26 pm IST

వివి వినాయక్ హీరోగా మారిపోయారు. దిల్ రాజు నిర్మాతగా ఎన్ నరసింహ దర్శకుడిగా నిన్న ఘనంగా ఆయన మూవీ ప్రారంభమైంది. సీనయ్య అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలోని వివి వినాయక్ మాస్ గెటప్ అదిరిపోయింది. నిన్న ప్రారంభమైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి టాలీవుడ్ ప్రముఖ దర్శకులైన రాఘవేంద్ర రావు, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, సుకుమార్,మెహర్ రమేష్ తదితరులు హాజరయ్యారు.

కాగా హీరోగా మారినప్పటికీ దర్శకుడిగా వివి వినాయక్ తన డ్రీం ప్రాజెక్ట్ ఒకటిందని బయటపెట్టారు. మహాభారతం దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమకు అల్ టైం ఫేవరేట్ మూవీ మెటీరియల్ గా ఉంటూ వస్తుంది. మహాభారతంపై అందులోని పాత్రలపై వందల చిత్రాలు వచ్చినా, ఇంకా హాట్ పేవరేట్ కథగానే ఉంటూ వచ్చింది. దర్శక ధీరుడు రాజమౌళి మహాభారతాన్ని భారీ బడ్జెట్ తీయడమే నా కల అని అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. ఇక నంబర్ వన్ మాస్ డైరెక్టర్ గా పేరున్న వివి వినాయక్ కల కూడా తారక్ తో దానవీర్ శూర కర్ణ మూవీ తీయాలనంట. మరి వీరిద్దరి కల ఎప్పటికీ నెరవేరనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More