ప్రియాంకా చోప్రా ఓటిటి సినిమాపై ఎగ్జైట్ అవుతున్న జక్కన్న.. ఎందులో రాబోతుందంటే!

ప్రియాంకా చోప్రా ఓటిటి సినిమాపై ఎగ్జైట్ అవుతున్న జక్కన్న.. ఎందులో రాబోతుందంటే!

Published on Jan 22, 2026 12:17 PM IST

Rajamouli

పాన్ ఇండియా లెవెల్లో మాత్రమే హాలీవుడ్ సినిమా దగ్గర కూడా మంచి ప్రాజెక్ట్ లు చేస్తూ వెళుతున్న ఇండియన్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రియాంక చోప్రా (Priyanka Chopra) అని చెప్పాలి. ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో సెటిల్ అయ్యాక ఇండియన్ సినిమా దగ్గర చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ నే ‘వారణాసి’. మరి ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా తన హీరోయిన్ నటించిన లేటెస్ట్ ఓటిటి సినిమా (The Bluff) విషయంలో జక్కన్న ఎగ్జైటెడ్ గా ఉన్నట్టుగా తెలిపారు.

Rajamouli praises Priyanka Chopra – ప్రియాంకా చోప్రాపై రాజమౌళి ప్రశంసలు!

ప్రియాంక ఎప్పుడూ నన్ను సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. ఆమె అన్ స్టాపబుల్ కమాండింగ్ ప్రెజెన్స్, ఫైరీ పెర్ఫామర్ అంటూ ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం “ది బ్లఫ్” (Priyanka Chopra in The Bluff) కోసం ఎదురు చూస్తున్నట్టు పోస్ట్ చేశారు.

Varanasi beauty in The Bluff – ‘వారణాసి’ బ్యూటీ చేసిన సినిమా ఏ ఓటిటిలో అంటే

ప్రియాంక చోప్రా, ది బాయ్స్ సిరీస్ నటుడు కార్ల్ అర్బన్ కలయికలో చేసిన హాలీవుడ్ సినిమానే ‘ది బ్లఫ్’. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఎక్స్ క్లూజివ్ గా ప్రైమ్ వీడియోలో ఈ ఫిబ్రవరి 25 నుంచి పాన్ వరల్డ్ భాషల్లో తీసుకు వస్తున్నారు.

సో జక్కన్న ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్టుగా తన హీరోయిన్ పై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమాకి ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు