ఆర్ ఆర్ ఆర్ విషయంలో రాజమౌళి లెక్కలు తప్పుతున్నాయా… !

Published on Oct 16, 2019 7:10 am IST

బాహుబలి మూవీ తరువాత ఇండియాలోని గొప్ప దర్శకులలో ఒకరిగా పేరుగాంచిన రాజమౌళికి అపజయం అంటూ తెలియదు. ఆయన నిర్మించిన 11సినిమాలు విజయం సాధిండానికి కారణం, ఆయనకున్న క్రమశిక్షణ, పని పట్ల నిబద్దత అని చెప్పొచ్చు. స్క్రిప్ట్ దగ్గరి నుండి, షెడ్యూల్స్, చిత్రీకరణ, విడుదల తేది ప్రతి విషయంలో క్రిస్టల్ క్లియర్ గా స్పష్టత మైంటైన్ చేస్తారు. అంతటి పర్ఫెక్షనిస్ట్ కాబట్టే బాహుబలి లాంటి భారీ చిత్రాలను ఐదేళ్లలో నిర్మించి, ఎవ్వరూ చేరుకోలేని బెంచ్ మార్క్ సెట్ చేశారు.

కాగా ఆర్ ఆర్ ఆర్ విషయంలో మాత్రం రాజమౌళి లెక్కలు తప్పుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎప్పుడూ లేని కొత్త సమస్యలు, అనుభవాలు ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆయనకు ఎదురవుతున్నాయి. షూటింగ్ షెడ్యూల్స్ వాయిదా పడటం, అనుకున్న హీరోయిన్స్ మధ్యలో తప్పుకోవడం, హీరోలకు గాయాలు కావడం ఇలా వరుస సమస్యలు, ఒకదాని వెంట మరోటి వచ్చిపడుతున్నాయి. ఇక తాజాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ జక్కన్న చెప్పినట్లు జులై 30న విడుదలయ్యే అవకాశమే లేదని ప్రచారం జరుగుతుంది. ఏకంగా ఈ మూవీ 2021కి షిఫ్ట్ అయ్యిందట. మరి ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు గాని, కొద్దిరోజులుగా ప్రముఖంగా వినిపిస్తుంది. అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసే జక్కన్న కు ఇలాంటి సమస్యలు పెద్ద లెక్కేమీ కాదని కొందరి వాదన. మరి చూద్దాం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ని అనుకున్న తేదీకి విడుదల చేస్తారో లేక ఆలస్యం చేస్తారో…?.

సంబంధిత సమాచారం :

More