బాలీవుడ్ ఎంట్రీకి సిద్దమవుతున్న రాజమౌళి !

4th, April 2017 - 12:40:47 PM


‘బాహుబలి’ సిరీస్ తో దేశవ్యాప్త గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి బాలీవుడ్ ఎంట్రీపై ఒక ఒక క్లారిటీ వచ్చింది. తాజాగా బాహుబలి ప్రమోషన్లలో భాగంగా ఢిల్లీలో జాతీయ స్థాయి మీడియాతో మాట్లాడిన దర్శక ధీరుడు మీ బాలీవుడ్ డెబ్యూట్ ఎప్పుడు అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు. బాహుబలికి సంబందించిన పనులన్నీ పూర్తవడంతో రాజమౌళి కొత్త స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నానని అన్నారు.

ఆ స్క్రిప్ట్ తోనే బాలీవుడ్ లో సినిమా తీయాలనుకుంటున్నానని కూడా తెలిపారు. అలా రాజమౌళి ఉన్నట్టుండి బాలీవుడ్ సినిమా గురించి మాట్లాడటంతో ఆయన ఎలాంటి కథను సిద్ధం చేస్తున్నారు, నటీనటులెవరు, ఆ చిత్రం బాహుబలి కన్నా గొప్ప స్థాయిలో ఉంటుందా అనే చర్చలు మొదలయ్యాయి. వీటన్నింటికీ సరైన సమాధానం దొరకలాంటే ఏప్రిల్ 29న ‘బాహుబలి 2’ విడుదలై కొంతకాలం గడిచే వరకు ఆగాల్సిందే.