‘రాజమౌళి’ ఆ హీరోయిన్ కి బాగా ఇంప్రెస్ అయ్యాడట !

‘రాజమౌళి’ ఆ హీరోయిన్ కి బాగా ఇంప్రెస్ అయ్యాడట !

Published on Jun 29, 2018 4:00 PM IST

rajamouli11

దర్శక ధీరుడు రాజమౌళి తనకు నచ్చిన చిత్రాల పై ట్వీటర్ వేదికగా ఆ చిత్రబృందానికి అభినందనలు తెలుపుతుంటారు. అలాగే ఈ రోజు కూడా రెండు చిత్రాలను అభినందించారు. అందులో ఒకటి సమ్మోహనం కాగా, మరోకటి ఈనగరానికి ఏమైంది. సమ్మోహనం చిత్రాన్ని కాస్త ఆలస్యంగా చూశాను. కానీ ఇంప్రెస్‌ అయ్యాను. సుధీర్‌ బాబు, నరేష్ గారి నటన ఆకట్టుకుందని రాజమౌళి ట్వీట్ చేశారు. అదే విధంగా అదితిరావు హైదరీ నటన కూడా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు.

అలాగే యువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ చిన్న చిత్రాలతోనే ట్రెండ్‌ సృష్టిస్తున్నారు. తాజాగా తరుణ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. ఈ చిత్రాన్ని చూసిన రాజమౌళి తరుణ్‌ భాస్కర్‌ ను కూడా ప్రత్యేకంగా ట్వీటర్ ద్వారా అభినందించారు.

తాజా వార్తలు