సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ వారణాసి(Varanasi) కోసం అందరికీ తెలిసిందే. భారీ హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాని మేకర్స్ గ్లోబల్ లెవెల్ సినిమాగా తెరకెక్కిస్తూ రిలీజ్ సన్నాహాలు కూడా అదే రీతిలో చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగా సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన కంటెంట్ వైడ్ రీచ్ ని సొంతం చేసుకుంది. ఇక ఇదే గ్లింప్స్ ఇప్పుడు యునిక్ ఫీట్ సెట్ చేసింది.
ప్యారిస్ ఐకానిక్ థియేటర్ లో వారణాసి గ్లింప్స్
వరల్డ్ వైడ్ ఎన్నో భారీ సినిమాలు తాలూకా కంటెంట్ ని ప్యారిస్ కి చెందిన లే గ్రాండ్ రెక్స్ స్క్రీన్ లో ప్లే చేయడం జరిగింది. వాటిలో అవెంజర్స్ డూమ్స్ డే లాంటి సినిమాల టీజర్ లు కూడా వేశారు. మరి వాటితో పాటుగా ఈ ఈవెంట్ లో వారణాసి గ్లింప్స్ కూడా ప్లే చేయడం జరిగింది. దీనితో ఇండియన్ సినిమా నుంచి మొట్టమొదటి సినిమాగా వారణాసి నిలిచిందట.
మేకర్స్ హ్యాపీ.. అసలు ట్రీట్ ముందుంది
ఇక ఈ ఐకానిక్ స్క్రీన్ లో వారణాసి గ్లింప్స్ ప్లే చేయడంపై మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అసలు ట్రీట్ తమ ప్రపంచాన్ని 2027 లో చూపిస్తామని అందుకు సిద్ధంగా ఉండమని చెబుతున్నారు.
Merci au Le Grand Rex pour cette projection exceptionnelle.
Et merci Paris, merci au public français, pour cet accueil incroyable. ✨De Varanasi à Paris, l’aventure commence. Rendez-vous en 2027 pour l’épopée complète https://t.co/igKZd75rRY
— Varanasi (@VaranasiMovie) January 6, 2026
